గుంటూరు జిల్లాలో ఆధునీకరించిన సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, ముప్పాళ్ల పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను ఆధునీకరించి ఫిర్యాదుదారులకు ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తామని ఎస్పీ విశాల్ గున్నీ అన్నారు. బాధితుల సమస్యలను తెలుసుకుని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన నాడు-నేడు కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పోలీస్ స్టేషన్లలో మార్పులు తీసుకువస్తున్నట్టు అంబటి రాంబాబు తెలిపారు.
ఇదీచదవండి.
ఇదీ చదవండి : రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు