ETV Bharat / state

పచ్చళ్ల సీజన్ ప్రారంభం..ఆకాశానికి మిర్చి ధరలు - మిర్చి ధరలు తాజా వార్తలు

మిర్చి ధరలు రోజురోజుకీ పైగి ఎగబాకుతున్నాయి. ఎగుమతి రకాలతో పాటు దేశీయంగా కారంపొడి కోసం వినియోగించే వెరైటీలకు కూడా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా పచ్చళ్ల సీజన్ కావటంతో 341 రకం మిర్చికి గిరాకీ ఎక్కువైంది. మంచి రంగు, ఘాటుతో పాటు నిల్వకు అనుకూలంగా ఉండటమే దీనికి కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మామిడి సీజన్ వచ్చే నాటికి పచ్చళ్ల కారం రకాల ధరలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పెరిగిన మిర్చి ధరలు
పెరిగిన మిర్చి ధరలు
author img

By

Published : Mar 16, 2021, 8:20 PM IST

గుంటూరు మిర్చియార్డుకు రోజుకు సరాసరిన 1.20 లక్షల నుంచి 1.50 లక్షల టిక్కీల సరకు వస్తోంది. ఈ సీజన్​లో ఇప్పటికే 43,27,820 బస్తాల మిర్చి క్రయవిక్రయాలు జరిగాయి. సాధారణంగా గుంటూరు మిర్చిలో తేజ రకానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. విదేశాలకు ఈ రకం ఎక్కువగా ఎగుమతి అవుతుంది. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా 341 రకం మిర్చికి డిమాండ్ పెరిగింది. రంగు, ఘాటుతో కూడిన రుచి ఉండటంతో ఈ రకం కాయల్ని కారంపొడి తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దేశీయంగా పచ్చళ్ల తయారీతో పాటు గృహావసరాలకు ఈ రకాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

పచ్చళ్ల సీజన్ ప్రారంభంతో..

పచ్చళ్ల సీజన్‌ ఇప్పటికే ప్రారంభం కావటంతో...మరో రెండు, మూడు నెలల పాటు 341 రకానికి ఇదే డిమాండ్ కొనసాగనుందని అంచనా వేస్తున్నారు. 20 రోజుల కిందట క్వింటా రూ.13వేల నుంచి రూ.13,500 పలకగా ప్రస్తుతం క్వింటాకు రూ.15 వేలకు అటూ ఇటూ వస్తోంది. మన రాష్ట్రంలో రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా 341 రకం పండిస్తారు. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ ఈ రకం సాగవుతోంది. తెలంగాణా జిల్లాల నుంచి కూడా కొందరు రైతులు ఈ వెరైటీని తీసుకువస్తున్నారు. 5 నంబర్ రకం మిర్చి కూడా దాదాపు ఇవే లక్షణాలతో ఉంటుంది. ఈ రెండు రకాల కారం పొడిని పచ్చళ్ల తయారీలో ఉపయోగిస్తారని.. వాటికి డిమాండ్ బాగుందని మిర్చియార్డు అధికారులు చెబుతున్నారు.

పెరిగిన దిగుబడి

ఈ ఏడాది మిర్చికి సకాలంలో వర్షాలు కురవటంతో పంట దిగుబడి పెరిగింది. సీజన్‌ ప్రారంభం నుంచి నాణ్యమైన 341 రకం మిరప మార్కెట్‌కు వస్తున్నాయి. వాటి నాణ్యత చూసి కారం తయారు చేసే ప్రముఖ కంపెనీలు 341 రకం మిర్చిని ఎక్కువగా కొని నిల్వ చేస్తున్నాయి. దీంతో ధరలు రోజురోజుకీ పైకి వెళ్తున్నాయి. కేవలం ఏపీలోని కంపెనీలే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కంపెనీలు, వ్యాపారులు కూడా ఈ రకం కావాలని అడుగుతున్నారు. కొందరు వ్యాపారులు మిర్చియార్డుకు రాకముందే నేరుగా రైతుల వద్దే కొనుగోలు చేస్తున్నారు. సరకుని సమీపంలోని శీతల గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. దీంతో గుంటూరు మార్కెట్‌ ఆధారంగా ఉన్న కారం మిల్లులు, ఇతర వ్యాపారులకు అవసరమైన సరకు రావటం లేదు. మార్కెట్‌లో లభ్యత తగ్గడంతో గిరాకీ పెరిగి...ఆ మేరకు ధర కూడా పెరిగిందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రికార్డు ధరలు

మిర్చిలో నాణ్యమైన బాడిగ, తేజ రకాలకు కూడా మంచి ధరలు లభిస్తున్నాయి. బాడిగ రకాలు క్వింటాలు రూ.17 వేల నుంచి 25 వేలు, తేజ రకం రూ.15 వేల నుంచి రూ.18వేల వరకూ పలుకుతోంది. మూడు నెలల క్రితం బాడిగ మిర్చిలో నాణ్యమైన రకం క్వింటా రూ.36 వేలు పలికి రికార్డు సృష్టించింది. తేజ కూడా 25వేల వరకూ పలికింది. కానీ ఎప్పుడు రూ.10 నుంచి రూ.12వేలలోపు ఉండే 341 రకానికి ఎక్కువగా ధర రావటం ఈసారి విశేషం.

ఇదీచదవండి

ఇవాళ, రేపు ఉత్రరాంధ్ర, యానాంలో ఉరుములు, మెరుపులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.