మార్కెట్కు కొత్త మిర్చి వస్తున్న వేళ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు క్వింటాకు సగటున 2 వేల నుంచి 2 వేల 500కు ధర పతనమైందని గుంటూరు రైతులు వాపోతున్నారు. ఎగుమతి రకాలతోపాటు దేశీయంగా వినియోగించే రకాలకు ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది పత్తి పంట నష్టాలు మిగల్చడంతో తప్పనిసరి పరిస్థితుల్లో.. మరో నష్టం ఎదురు కానుందని ఆవేదన చెందారు. ప్రస్తుతం మార్కెట్కు వస్తున్న మిర్చిలో 10 శాతం మంది రైతులు మాత్రమే శీతల గోదాముల్లో నిల్వ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. తేజ రకంతోపాటు అన్ని రకాల మిర్చి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
ఇదీ చదవండి:
ఎన్నికల ముందు సరే.. తర్వాత వాడేసిన బ్యాలెట్ పత్రాలు ఏం చేస్తారు?