ETV Bharat / state

ఉక్రెయిన్​లో ఉన్న తెలుగు విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారు: మంత్రి సురేశ్ - మంత్రి సురేశ్ తాజా వార్తలు

ఉక్రెయిన్​లో ఉన్న తెలుగు విద్యార్థులను స్వదేశానికి తీసుకురావటానికి అన్ని రకాల చర్యలూ చేపట్టామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వారందరూ అక్కడ క్షేమంగా ఉన్నారని తెలిపారు.

మంత్రి సురేశ్
మంత్రి సురేశ్
author img

By

Published : Feb 25, 2022, 5:04 PM IST

ఉక్రెయిన్​లో ఉన్న తెలుగు విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావటానికి అన్ని రకాల చర్యలూ చేపట్టామని తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం.. విమానాలు అందుబాటులో లేకపోవటంతో కొంత ఆలస్యం జరుగుతోందన్నారు. సుమారు 4 వేల మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్​లో ఉన్నట్లు సమాచారం ఉందన్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాకు ఆటంకాలు సృష్టిస్తున్నారని అనడం సరికాదని మంత్రి సురేశ్ అన్నారు. తాగి మైకులు ముందుకువచ్చి వాగే వారి మాటలను పట్టించుకోమన్నారు. ప్రజల గురించి ఆలోచన చేయకుండా ఓ వ్యక్తి గురించి ఆలోచన చేయటం సరికాదన్నారు.

ఉక్రెయిన్ సంక్షోభంపై రాష్ట్రంలో కంట్రోల్ రూమ్: సీఎస్‌
ఉక్రెయిన్ సంక్షోభంపై రాష్ట్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సీఎస్‌ సమీర్ శర్మ స్పష్టం చేశారు. ఎం.టి.కృష్ణబాబు, బాబు.ఎకు కంట్రోల్ రూమ్ బాధ్యతలు చేపడతారన్నారు. 1902కు కాల్ చేసి ఉక్రెయిన్‌లో ఉన్నవారి వివరాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. పోలాండ్, ఉక్రెయిన్ సరిహద్దులతోపాటు మరో దేశ సరిహద్దు నుంచి విద్యార్థులను తరలించేందుకు విదేశాంగశాఖ ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దాటించాక విమానాల ద్వారా వారిని దిల్లీకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టరన్నారు.

ఇదీ చదవండి

Telugu students on Ukraine crisis : ఉక్రెయిన్‌లో యుద్ధం.. స్వస్థలాలకు రావడానికి తెలుగు విద్యార్థుల బెంబేలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.