water facility for mangalgiri AIIMS: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌కు వీలైనంత త్వరలో నీటి సౌకర్యం అందిస్తామని.. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. మంగళగిరిలో పర్యటించిన మంత్రి.. పానకాల నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీటి సరఫరా చేసే విషయంపై అధికారులతో సమీక్షించారు.
చెరువు నుంచి నీరు ఇచ్చేందుకు ప్రతిపాదనలు
ఎయిమ్స్‌కు.. గుంటూరు ఛానెల్ ద్వారా నీరు ఇస్తే.. నిర్వహణ ఖర్చు భారీగా పెరుగుతుందని అధికారులు మంత్రికి వివరించారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో 60 ఎకరాల్లో చెరువుందని.. ప్రస్తుతం అందులో అర టీఎంసీ నీరు ఉందని.. దాని నుంచి నీరు ఇస్తే నిర్వహణ భారం తగ్గుతోందని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంత్రికి తెలిపారు. చెరువును పరిశీలించిన మంత్రి.. ఇక్కడి నుంచి నీరు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు సన్నాహలు
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు.. ఎయిమ్స్ కు అవసరమైన నీటిని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మంగళగిరి, గుంటూరు, తెనాలికి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా అందిస్తామన్నారు.
ఇదీ చదవండి: ఆర్య వైశ్యులపై దాడులను అరికట్టాలంటూ.. ఆర్యవైశ్య ఐక్యత సభ