ETV Bharat / state

ఇసుక వ్యవహారంపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు - Jagananna colonies news in guntur district

స్థానిక ఎమ్మెల్యేలకు తెలియకుండా ఇసుక పక్కదారి పడుతోందని.. గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అక్షేపించారు. జగనన్న కాలనీల నిర్మాణ ప్రగతిపై తెనాలి డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణ విషయంలో అనేక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

MLA
MLA
author img

By

Published : Feb 4, 2022, 10:31 PM IST

గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జగనన్న కాలనీల నిర్మాణ ప్రగతిపై జిల్లా ఇన్​ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, మేరుగ నాగార్జున, కిలారి రోశయ్య, జడ్పీ ఛైర్పర్సన్ హెన్రీ క్రిస్టియన, కలెక్టర్ వివేక్ యాదవ్.. ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు.

తమ నియోజకవర్గంలో అధికారుల సమన్వయ లోపంతోనే జగనన్న ఇళ్ల నిర్మాణం పనుల్లో అలసత్వం జరుగుతుందని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా ఇసుక పక్కదారి పడుతోందని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం చేసిన వాటికి ఇంకా డబ్బులు రాలేదని.. అందరూ కలిసి పని చేయకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని తెలిపారు. ఎమ్మెల్యేల ప్రమేయమే లేకుండా అధికారులే ఇల్లు కట్టుకుంటామంటే తాము తప్పకుంటామని మంత్రి ఎదుట స్పష్టం చేశారు. తెనాలి నియోజకవర్గంలో 10 వేల ఇళ్ల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయని.. కానీ ఇక్కడ ఇసుక కొరత ఎక్కువగా ఉందని వెల్లడించారు.

ఇదీ చదవండి

Asset value increase: ఆస్తుల విలువ పెంపు... ఏప్రిల్‌ 1 నుంచి అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.