ETV Bharat / state

'తెదేపా శవ రాజకీయాలు మానుకోవాలి' - ప్రత్తిపాడు ఆత్మహత్యపై స్పందించిన సుచరిత

తెదేపాపా శవ రాజకీయాలు చేస్తుందని హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. ప్రత్తిపాడులో వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే వైకాపా నాయకుల వేధింపుల వల్లే చేసుకున్నాడన్న లోకేశ్​ వ్యాఖ్యలపై గుంటురు జిల్లా కానుమానులో ఆమె ఘాటుగా స్పందించారు.

లోకేశ్​ వ్యాఖ్యలపై స్పందించిన మేకతోటి సుచరిత
author img

By

Published : Nov 23, 2019, 8:32 AM IST

Updated : Nov 23, 2019, 9:08 AM IST

లోకేశ్​ వ్యాఖ్యలపై స్పందించిన మేకతోటి సుచరిత

పార్టీల ప్రమేయం లేకుండా వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే... తెదేపా శవ రాజకీయాలు చేస్తుందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పర్యటనకు వచ్చిన లోకేశ్​ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. కాకుమానులో మాట్లాడిన సుచరిత... తెదేపా పాలనలోనే గోవాలపల్లి నాగమణి ఉన్నవ శ్రీనివాస్​పై కేసు పెట్టిందనీ...2019 ఫిబ్రవరిలో కోర్టులో కేసుపై సాక్షులతో విచారణ జరిగి ఛార్జిషీట్ ఫైల్ చేశారని చెప్పారు. తీర్పు వెలువడే సమయంలో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఆత్మహత్య చేసుకున్న అతన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా... అప్పుల బాధతో చేసుకున్నాడని మృతుడి భార్య ఫిర్యాదు ఇచ్చినట్లు సుచరిత వెల్లడించారు. మూడు రోజుల తరువాత శ్రీనివాస్ మృతి చెందాడన్నారు. అతని జేబులో సూసైడ్ లేఖ ఉందని... అందులో నాగమణి హింస వలన చనిపోయాడని రాసి ఉన్నట్లుగా చెప్పారన్నారు. ఈ ఆత్మహత్యతో పార్టీలకు, రాజకీయాలకు సంబంధం లేదన్నారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన లోకేశ్​ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు.

ఇదీ చూడండి

రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ మ్యాప్ విడుదల

Intro:Ap_gnt_61_22_tdp_sava_rajakiyalu_chesthundi_home_minister_avb_AP10034

contributor : k. vara prasad (prathipadu),guntur

Anchor : పార్టీల ప్రమేయం లేకుండా వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే...దాని పై తెదేపా శవ రాజకీయాలు చేస్తుందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పర్యటనకు వచ్చిన లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. కాకుమానులో మీడియా ఏర్పాటు చేసి మాట్లాడారు. తెదేపా పాలనలోనే గోవాలపల్లి నాగమణి
2018 లో ఉన్నవ శ్రీనివాస్ పై కేసు పెట్టిందని....2019 ఫిబ్రవరి లో కోర్టులో కేసుపై సాక్షులతో విచారణ జరిగి ఛార్జి షీట్ ఫైల్ చేశారని చెప్పారు. తీర్పు వెలువడే సమయంలో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఆత్మహత్య చేసుకున్న అతన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.....అప్పుల బాధతో ఇలా చేసుకున్నాడని మృతుడి భార్య పిర్యాదు ఇచ్చినట్లు సుచరిత వెల్లడించారు. మూడు రోజుల తరువాత మృతి చెందిన వ్యక్తి జేబులో సూసైడ్ లేఖ ఉందని....అందులో నాగమణి హింస వలన చనిపోయాడని రాసి ఉన్నట్లుగా చెప్పారన్నారు. ఈ ఆత్మహత్యతో.....పార్టీలకు, రాజకీయాలకు
సంబంధం లేదన్నారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన లోకేష్ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ఖాకి చొక్కాలు వైకాపా అనుకూలంగా వ్యవహరిస్తున్నారని....పోలీస్ స్టేషన్ లకి వైకాపా రంగులు వేసుకుంటారేమోనాని లోకేష్ అనడం ఏమిటని ప్రశ్నించారు. తెదేపా ఆరోపిస్తున్న 7 హత్యలలో ఒక్క హత్యను కూడా రుజువు చేయలేకపోయారని చెప్పారు. తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే అని ....సొంత పార్టీ ఎమ్మెల్యేను కూడా అరెస్ట్ చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బైట్ : మేకతోటి సుచరిత, హోంమంత్రి

Body:end

Conclusion:end
Last Updated : Nov 23, 2019, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.