పేదల ఆకలి తీర్చేందుకు గుంటూరు మేయర్ కావటి మనోహరనాయుడు ఓ చిరు ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. నగరంలో జరిగే శుభకార్యాలు, విందుల్లో మిగిలిన ఆహార పదార్థాలను ఆకలితో ఉన్నవారికి అందించేలా చర్యలు చేపట్టారు. దీనికోసం ఐదు ఫ్రిజ్‌లను సిద్ధం చేశారు. ఆహార పదార్థాలను సేకరించి ఈ ఫ్రిజ్‌లలో ఉంచనున్నారు. ఆకలితో వచ్చే వారికి ఈ ఆహారాన్ని అందించనున్నారు. దీని కోసం ఐదు ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు.
జనం ఎక్కువగా ఉండే గాంధీపార్కు, జీజీహెచ్, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జి సెంటర్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే ఉచిత ఆహారశాల వద్ద ఒక కార్పోరేషన్ ఉద్యోగిని ఉంచుతారు. వచ్చిన వారికి ఆహారం అందించే బాధ్యత వారికి అప్పగిస్తారు. చిన్నపాటి షెడ్లలో ఈ ప్రిజ్ లను ఉంచుతున్నారు. వీటికి అవసరమైన ఉపకరణాలను బిగించే పనులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఈ ఆలోచన కార్యరూపం దాల్చనుంది. దీని ద్వారా ఆకలితో ఉన్నవారి ఇబ్బంది తొలగించటంతో పాటు... ఆహారం వృథా కాదని మేయర్ తెలిపారు.
ఇదీ చూడండి:
Chandrababu: 'మామిడి రైతులకు ధరల స్థిరీకరణ సంస్థ ఏర్పాటు చేయాలి'