గుంటూరు జిల్లా మాచర్ల మండలం చింతల తండాలో మౌనిక అనే వివాహిత మనస్తాపానికి గురై అత్మహత్య చేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని భర్త వేధింపులకు గురైన మౌనిక ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్లితే చింతల తండాకు చెందిన ధనవత్ మౌనిక(21)కు అశోక్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా పిల్లలు పుట్టలేదని తరుచూ అశోక్ తన భార్యను వేధిస్తున్నాడు. మనస్తాపానికి గురైన మౌనిక ఈ నెల 26న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి మృతి చెందారు. పంచనామా నిమిత్తం మృతదేహన్ని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విజయపురిసౌత్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి