ETV Bharat / state

కొవిడ్ కేంద్రంలో పెళ్లి రోజు వేడుకలు - గుంటూరు జిల్లా వార్తలు

ఆ దంపతులిద్దరూ కరోనా బారిన పడ్డారు. వారిద్దరూ ఓ కొవిడ్ సంరక్షణ కేంద్రంలో చేరారు. ఈ లోగా వారి పెళ్లిరోజు వచ్చింది. కష్టకాలం కావటంతో పెళ్లిరోజు వేడుకలు వద్దని అనుకున్నారు. అయితే వారిలో ధైర్యం నింపేందుకు కొవిడ్ కేర్ సెంటర్ నిర్వాహకులు ఓ కేకు తీసుకువచ్చి ఆ దంపతులతో కట్ చేయించారు. తోటి కొవిడ్ రోగుల సమక్షంలో పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నారు. గుంటూరులో సీపీఎం ఆధ్వరంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్​లో ఈ వేడుకలు జరిగాయి.

కొవిడ్ కేంద్రంలో పెళ్లి రోజు వేడుకలు
కొవిడ్ కేంద్రంలో పెళ్లి రోజు వేడుకలు
author img

By

Published : May 19, 2021, 10:21 PM IST

కొవిడ్ కేంద్రంలో పెళ్లి రోజు వేడుకలు

గుంటూరులో సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్​లో ఓ జంట తమ 12వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. నగరానికి చెందిన విమల్ సాగర్, సంధ్యారాణి దంపతులకు కరోనా సోకగా కొద్ది రోజుల క్రితం ఈ కేంద్రానికి వచ్చారు. ఇవాళ వారి పెళ్లిరోజు. అయితే వారిలో ధైర్యం నింపేందుకు కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహకులు ఓ కేకు తీసుకువచ్చి దంపతులతో కట్ చేయించారు. కుటుంబ సభ్యుల మధ్య జరపాల్సిన వేడుకని తోటి కొవిడ్ బాధితులతో కలిసి ఆనందోత్సహల మధ్య నిర్వహించుకున్నారు. అందరు సాగర్, సంధ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ ఇతర ఆత్మీయుల మధ్య సంబరాలు చేసుకోవటం ఆ దంపతులకు మంచి అనుభూతిని మిగిల్చింది.

ఇదీ చదవండి:

అల్లు అర్జున్​ రికార్డును బ్రేక్​ చేసిన రౌడీహీరో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.