రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులో ఉన్న తరుణంలో రోగులకు సహాయంగా వచ్చిన వారికి పలు సంస్థలు ఆహారాన్ని పంపిణీ చేశాయి.
గుంటూరు జిల్లా
గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై, ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న వారి బంధువులకు హరే రామ హరే కృష్ణ ఆధ్వర్యంలోని అక్షయపాత్ర సంస్థ ఉచితంగా ఆహారాన్ని అందించింది. కర్ఫ్యూ నేపథ్యంలో రోగుల సహాయకులకు ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే వారికి అహారం పంపిణీ చేశామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
విశాఖ జిల్లా
విశాఖ జిల్లాలో బ్లాక్ అండ్ వైట్ మీడియా స్వచ్ఛంద సంస్థ ఆహార పంపిణీ కార్యక్రమం చేపట్టింది. నగరంలోని పలు ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు సహాయకులుగా వచ్చని వారికి, పారిశుద్ధ్య సిబ్బందికీ, రహదారులు పక్కనున్న నిరాశ్రయులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి సైతం ఆహారం పొట్లాలను అందజేశారు.
అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా సోమందేపల్లిలో కరోనా విపత్తులో ఆకలితో అల్లాడుతున్న నిరు పేదలకు శ్రీ సత్య సాయి భజన మండలి.. అండగ నిలిచింది. పంచాయతీలోని పలు కాలనీలలో ఉన్న 45 నిరుపేద కుటుంబాలకు పది రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి