మహానటి సావిత్రి గారు కట్టించిన పాఠశాలకు రావడం ఆనందంగా ఉందని నిర్మాత ప్రియాంకదత్ తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం వడ్డెవారిపాలెంలోని సావిత్రి గణేష్ ఉన్నత పాఠశాలకు ఆమె బస్సును విరాళంగా ఇచ్చారు. మహానటి చిత్రపటానికి సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరితో కలిసి నివాళులర్పించారు. అనంతరం బస్సు సేవలను ప్రారంభించారు. విద్యార్థులకు అన్ని రంగాల్లో చేయూతనిస్తామన్నారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)