రాజధాని పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు ఆరోపించారు. చంద్రబాబు పాలనలో రాజధాని కోసం ఖర్చు పెట్టింది ఏమి లేదనన్నారు. తెదేపా నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం వారి వ్యాపార లాభాల కోసం రాజధానిపై కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుని చూస్తే ప్రజలు చిదరించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు చేసే నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆర్భాటం చేశారు కానీ... పనులు ముందుకు సాగలేదని ధ్వజమెత్తారు. నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
రాజధాని పేరుతో కొత్త నాటకానికి తెరతీశారు: మద్దాలి గిరి - రాజధాని పేరుతో కొత్త నాటకానికి తెర
చంద్రబాబు పాలనలో రాజధాని కోసం ఖర్చు పెట్టింది ఏమి లేదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు ఆరోపించారు. రాజధాని పేరుతో చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు.