ETV Bharat / state

'వంశీకో న్యాయం... నాకో న్యాయమా..?'

ఇటీవల ముఖ్యమంత్రి జగన్​ను కలిసిన ఎమ్మెల్యే మద్దాల గిరికి తెదేపా షాక్ ​ఇచ్చింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి కొత్త ఇన్​ఛార్జిని నియమించింది. దీనిపై మద్దాలి గిరి స్పందించారు. తెదేపా అధినేత చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.

author img

By

Published : Jan 2, 2020, 6:51 PM IST

madali giridhar wrote open letter to chadrababu
చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన మద్దాలి గిరిధర్
మీడియాతో మాట్లాడుతున్న మద్దాలి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్... తెదేపా అధినేత చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే 12గంటల వ్యవధిలోనే ఇన్​ఛార్జిని నియమిస్తారా... అని ప్రశ్నించారు. గన్నవరంలో వల్లభనేని వంశీ పార్టీకి దూరంగా ఉండి 3నెలలు అవుతుంది. ఇప్పటివరకూ అక్కడ ఇన్​ఛార్జినిను నియమించలేదని గుర్తుచేశారు. వంశీకో న్యాయం... నాకో న్యాయమా..?అని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక వర్గాలపై తెదేపా చిన్నచూపు చూస్తోందని మద్దాలి గిరి ఆరోపించారు. చంద్రబాబు సమాధానం చెప్పాలని మాద్దాలి గిరి డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి

అమరావతి మలిదశ ఉద్యమం: సకలజనుల సమ్మెకు సన్నద్ధం

AP_GNT_21_02_MLA_MADDALI_GIRDHAR_PC_AVB_AP10169 CONTRIBUTOR : ESWARACHARI, GUNTUR యాంకర్.... నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని కలవడానికి వెళితే.. రాత్రికి రాత్రే నియోజకవర్గ ఇంచార్జ్ గా మరొకరిని నియమించాల్సిన అవసరం ఏంటి అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ప్రశ్నించారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ఇంచార్జ్ మరొకరిని ప్రకటించడాన్ని తీవ్రంగా ఘండిస్తూ.. చంద్రబాబు నాయుడు కి బహిరంగ లేఖ అందచేస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తుందని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి, నిధులు కోసం ముఖ్యమంత్రి జగన్ కి కలిస్తే తప్పేంటని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని ఎందుకు కలిశారని ఒక్కమాట కూడా అడకాకుండా.. ఇంచార్జ్ గా మరో వ్యక్తిని నియమించారని మండిపడ్డారు. గన్నవరం, సత్తెనపల్లి , నియోజకవర్గల్లో ఇప్పటివరకు ఎందుకు ఇంచార్జ్ ని నియమించలేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తుందని ఆరోపించారు. జిల్లాలో 9 సీట్లు ఒక సామాజిక వర్గానికే కేటాయించారని దుయ్యబట్టారు. అన్న నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీకి తూట్లు పొడుస్తున్నారని దీనిపై చంద్రబాబు నాయుడు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ ని అట్టిపెట్టుకుని ఉంటే ఇదేనా మీరిచ్చే గౌరవం ఇదేనా అని ఆయన అన్నారు. అమరావతి కి వ్యతిరేకంగా విశాఖపట్నంలో మాట్లాడిన 4 ఎమ్మెల్యేలు పైన మీరు ఏమి చర్యులు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ని కలిసినందకు తన ఫ్లెక్సీలు చించారని ... తన బట్టలు కూడా చించుకోమనని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఇంకా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని ఆయన వెల్లడించారు. బైట్.... మద్దాలి గిరిధర్ , గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.