ETV Bharat / state

వానరానికి అంత్యక్రియలా?.. మరీ ఇంత జనమా? - గుంటూరులో కోతికి అంత్యక్రియలు

లాక్​డౌన్​తో మనుషులు చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించవద్దు. అలా చేస్తే గుంపులుగా ఉన్న జనంతో కరోనా వచ్చే ప్రమాదం ఉందని పోలీసులు, ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. ఇవేవీ వారికి పట్టలేదు. లాక్​డౌన్​ను ఏ మాత్రం పట్టించుకోలేదు. అందుకే చనిపోయిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. భారీగా జనం గుమిగూడారు.

lot of people are gathering without following lockdown for The monkey funeral at allavamvaripalem in guntur district
lot of people are gathering without following lockdown for The monkey funeral at allavamvaripalem in guntur district
author img

By

Published : Apr 27, 2020, 3:18 PM IST

Updated : Apr 27, 2020, 3:45 PM IST

వానర అంత్యక్రియలకు ఇంత జనమా!

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అల్లంవారిపాలెంలో వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఓ వానరం రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా అక్కడికక్కడే మరణించింది. ఇది గమనించిన స్థానికులు తప్పెట్లతో.. పూలు చల్లుకుంటూ ఆ కోతికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఓ పక్క గుంపులుగా ఉండటంతో కరోనా వ్యాపించి మనుషులు చనిపోతున్నారని పోలీసులు, అధికారులు చెబుతుంటే.. వీరు మాత్రం కోతికి అంతిమయాత్ర చేసిన తీరు ఆందోళనకు గురిచేస్తోంది.

ఇదీ చదవండి:

'కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి'

Last Updated : Apr 27, 2020, 3:45 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.