అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నారన్న కారణంతో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేయడాన్ని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. అమరావతి పరిరక్షణ కోసం జరిగే శాంతియుత నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు విద్యార్థులకు ఉందన్నారు. వారి సస్పెన్షన్ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే వేలాదిమంది విద్యార్థులతో 'చలో నాగార్జున యూనివర్శిటీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉపకులపతి తీరుపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి..