ETV Bharat / state

నరసరావుపేటలో మే17 వరకు లాక్​డౌన్: ఆర్డీఓ వెంకటేశ్వర్లు - corona latest news in narsaraopeta

కరోనా పాజిటివ్ కేసులు తగ్గించేందుకు అధికారులు చేపడుతున్న చర్యల్లో భాగంగా మే 17 వరకూ పూర్తి లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు నరసరావుపేట ఆర్డీఓ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. నరసరావుపేటలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరో నాలుగు రోజులు లాక్ డౌన్​ను పొడిగిస్తున్నట్లు ఆయన వివరించారు.

Lockdown on May 17 at Narasarao Pate guntur district
నరసరావుపేటలో మే17 వరకు లాక్​డౌన్
author img

By

Published : May 13, 2020, 9:00 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో మే 17 వరకూ లాక్​డౌన్ పొడిగిస్తున్నట్లు ఆర్డీఓ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు వారి ఇంటివద్దకే అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరికైనా నిత్యావసరాలు అందకపోతే ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి తెలియపరిస్తే ఇంటికి కావలసిన నిత్యావసరాలు పంపేవిధంగా చేస్తామన్నారు.

నిత్యావసరాలకు ఇబ్బందులు కలిగితే 08647-295551, 295552, 295553, 7993062365 నంబర్లకు ఫోన్ చేయాలని ఆర్డీఓ సూచించారు. అధికారులు చేపట్టిన మిషన్ మే 15కు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. మే 15 నాటికి నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు జీరో స్థాయికి తేవాలని అధికారులు నిర్ణయించినట్లుగా ఆయన తెలిపారు. అయినప్పటికీ గత నాలుగు రోజులుగా అడపాదడపా కేసులు వస్తున్నాయన్నారు. కాబట్టి ప్రజలు గమనించి ఎవరూ బయటకు రాకుండా అధికారులకు సహకరించాలని ఆర్డీఓ వెంకటేశ్వర్లు కోరారు.

ఇదీ చూడండి:800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.