పశ్చిమ గోదావరి జిల్లా కోయలగూడెం రాజవరం గ్రామానికి చెందిన రమ్య వయసు 25 సంవత్సరాలు. ఆమె ఆరు నెలలుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. రకరకాల చికిత్సలను పొందినా ఫలితం లేకపోయింది. చికిత్స నిమిత్తం గత నెల 17న గుంటూరు సర్వజనాస్పత్రిలోని న్యూరోసర్జరీ రెండో యూనిట్లో చేరింది. వైద్య పరీక్షలు నిర్వహించగా నడుము భాగంలో వెన్నుపూస జారి ఎడమ కాలుకి వచ్చే నాడి నొక్కు కుందని గమనించారు వైద్యులు. దీంతో ఈ నెల 3న నొక్కుతున్న డిస్కు భాగాన్ని మాత్రమే తొలగించేందుకు సూక్ష్మ రంధ్రం ద్వారానే సర్జరీ చేశారు.
ఈ రకం సర్జరీతో వెన్నుకు గానీ, వెన్ను కండరాలకు గానీ ఎలాంటి నష్టం ఉండదని వైద్యులు తెలిపారు. ప్రైవేటు ఆసుప త్రుల్లో రూ.లక్షల ఖరీదైన ఈ శస్త్రచికిత్సను సర్వజనాసుపత్రిలో ఇక నుంచి పూర్తి ఉచితంగా చేయనున్నట్లు న్యూరో సర్జరీ విభాగం ఆచార్యులు శేషాద్రి శేఖర్ వివరించారు. అవసరమైన రోగులు ప్రతి మంగళ, గురు వారాల్లో పొరుగు రోగుల విభాగంలోని 19వ నంబరు గదిలో సంప్రదించవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: ఆహార పదార్థాల తయారీలో నాణ్యత కరువు