ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం చెపట్టిన ‘కనెక్ట్ టు ఆంధ్ర’ అనే కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. ‘నాడు - నేడు’ రెండో విడతలో భాగంగా తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం, పరవాడ మండలాల్లోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ‘కనెక్ట్ టు ఆంధ్ర’ విభాగానికి లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్లు విరాళం ఇచ్చింది.
బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన లారస్ ల్యాబ్స్ సీఈవో డా.చావా సత్యనారాయణ సీఎంకు చెక్కును అందించారు. లారాస్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ చైతన్య, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు ఈ కర్యక్రమంలో పాల్గోన్నారు.
ఇదీ చదవండి:
Jagananna Vidya Deevena: 'జగనన్న విద్యా దీవెన'.. నేడే రెండో విడత నిధుల విడుదల