ETV Bharat / state

Illegal mining అడిగేవారు లేరు, అడ్డుకునేవారు లేరు.. అంత అధికార పార్టీ నేతలదే! - Perecherla Illegal Mining news

Illegal soil mining in Guntur district: రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు వారి వ్యాపారాల కోసం భూమాతకు గర్భశోకాన్ని కల్గిస్తున్నారు. అడిగేవారు లేక.. అడ్డుకునే వారు రాక.. అడ్డగోలుగా తవ్వకాలతో చెలరేగిపోతున్నారు. భూగర్భ జలాలకు తగిలేంత వరకు బుల్డోజర్లు దింపుతూ యథేచ్ఛగా మట్టి మాఫియా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రాత్రీపగలు అనే తేడా లేకుండా మట్టి తోలుతూ జేబులు నింపుకుంటున్నారు. ఈ వ్యాపారంపై ఈటీవీ భారత్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Illegal soil
Illegal soil
author img

By

Published : Apr 20, 2023, 4:05 PM IST

Illegal soil mining in Guntur district: పేరేమో పేదలది.. కాసులు మాత్రం పెద్దలకు. జగనన్న కాలనీల కోసమని చెప్పి మట్టి తవ్వకాలు. కానీ, తరలించేది మాత్రం ప్రైవేట్ వెంచర్లకు. అడిగేవారు లేరు.. అడ్డుకునే వారు రారనే ధైర్యంతో.. అడ్డగోలు తవ్వకాలతో చెలరేగిపోతున్నారు. భూగర్భ జలాలకు తగిలేంత వరకు బుల్డోజర్లు దింపుతూ భూమాతకు గర్భశోకం పెడుతున్నారు. రాత్రీపగలు అనే తేడా లేకుండా మట్టి తోలుతూ జేబులు నింపుకుంటున్నారు. ఇలా గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా వ్యాపారం మూడు టిప్పర్లు.. ఆరు లారీలతో విరాజిల్లుతోంది.

యథేచ్ఛగా వైఎస్సార్సీపీ నేతల మట్టి దందా.. ఇక్కడ కనిపిస్తున్నది జగనన్న కాలనీ. గుంటూరుకు 10 కిలోమీటర్ల దూరంలో పేరేచర్ల సమీపంలో ఉంది. ఇక్కడ 18 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. రోడ్లతో పాటు ఎత్తుపల్లాలు సరిచేసేందుకు భారీగా మట్టి అవసరమవుతోంది. ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వేందుకు రెవెన్యూ అధికారులు అనుమతిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు వైఎస్సార్సీపీ నేతలు మట్టి దందాకు తెరలేపారు. జగనన్న కాలనీలకు గ్రావెల్ పేరిట అనుమతి తీసుకుని ప్రైవేటు వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ‘ఈటీవీ-ఈనాడు-ఈటీవీ భారత్’ క్షేత్రస్థాయి పరిశీలనలో.. పేరేచర్ల కొండల్లో జరుగుతున్న మట్టి మాఫియా బాగోతం బయటపడింది.

పోరంబోకు భూముల్లో మట్టి తవ్వకాలు.. గుంటూరు పరిసర ప్రాంతాలతో పాటు పెదపలకలూరులోనూ పెద్ద ఎత్తున స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేస్తున్నారు. రోడ్ల నిర్మాణం, చదును చేయడానికి మట్టి కావాలి. టిప్పరు మట్టికి రూ. 4 వేల నుంచి రూ. 6 వేల వరకు వసూలు చేస్తున్నారు. గుంటూరుకు పేరేచర్ల కొండలు సమీపంలో ఉండటంతో అనుమతి తీసుకున్న నేతలు.. పోరంబోకు భూముల్లో తవ్వకాలు చేసి మట్టిని వెంచర్లకు తరలిస్తున్నారు. మేడికొండూరు, యడ్లపాడు మండలాల సరిహద్దులో మట్టి తవ్వకాలను ఈటీవీ- ఈనాడు- ఈటీవీ భారత్ బృందం చిత్రీకరిస్తుండగా.. టిప్పరు, ప్రొక్లయిన్‌ను అక్కడి నుంచి పంపించేశారు. వాహనాలు జగనన్న కాలనీ వైపు కాకుండా.. నాయుడుపేట వైపు వెళ్లడంతో మట్టి ఇతర ప్రాంతాలకు తరలివెళ్తోందని తేటతెల్లమైంది.

రాత్రీపగలు మట్టి తరలింపు.. గుంటూరు, పల్నాడు జిల్లాల సరిహద్దులు, కంకర క్వారీల వెనుక వైపు కొండల చెరువులోనూ ఇదే పరిస్థితి. క్రేన్లతో లోతుగా తవ్వటంతో భూగర్భ జలాలు పైకి వస్తున్నాయి. రాత్రీపగలు అనే తేడా లేకుండా భారీ వాహనాల్లో మట్టి తరలించడంతో మార్గమంతా గోతులమయమైంది. కొండల మధ్య నాణ్యమైన మట్టి లభిస్తుండటం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది.

ఆ ముగ్గురి నేతల ప్రమేయంతోనే.. ముగ్గురు అధికార పార్టీ నేతల ప్రమేయంతోనే మట్టి మాఫియా జరుగుతున్నట్లు సమాచారం. మేడికొండూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త, మాజీ ప్రజాప్రతినిధి, మండల స్థాయి నేత.. కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎవరికి మట్టి అవసరమైనా త్రిమూర్తులే రవాణా చేస్తారంటే పరిస్థితికి అద్దం పడుతోంది. ఇలా పేదల పేరిట అనుమతులు తీసుకుని పెద్దలు మట్టిని బొక్కేస్తున్నారు.

యథేచ్ఛగా వైసీపీ నేతల మట్టి దందా..

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.