ETV Bharat / state

'వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకునేందుకు వెయ్యి క్యూసెక్కులు' - krishna west ae news

వేసవిలో నీటి ఎద్దడిని నివారించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కృష్ణా పశ్చిమ డెల్టా ద్వారా నీటిని వినియోగించుకునే ప్రాంతాల్లో చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు నింపడానికి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు... కృష్ణా పశ్చిమ డెల్టా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరత్నం తెలిపారు.

krishna west delta ae
కృష్ణా పశ్చిమ డెల్టాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరత్నం
author img

By

Published : Apr 30, 2021, 10:58 PM IST

వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు కృష్ణా పశ్చిమ డెల్టా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరత్నం తెలిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు గ్రామాల పరిధిలోని చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు నింపుకోవడానికి చివరి దశగా నీటిని విడుదల చేసినట్లు వివరించారు. మే 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

'పూర్తిస్థాయిలో చెరువులు నింపుకోవాలి'

కృష్ణా పశ్చిమ డెల్టా జలాల కింద మొత్తం 120 చెరువులు, ఐదు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. దీనిలో గుంటూరు పరిధిలో 100 చెరువులు, ప్రకాశం జిల్లాలో 20 చెరువులు ఉన్నాయన్నారు. వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి రెండు నెలల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో ఈ నీటితో మంచినీటి చెరువులను, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: 500 కాదు వెయ్యి రోజులు ఉద్యమం చేయండి: బొత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.