ETV Bharat / state

పేరుకే ఆర్జీవీ - కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా వైసీపీనే: కొలికపూడి - కొలికపూడిపై ఆర్జీవీ కేసు

Kolikapudi Srinivasa Rao Explanation of Comments on RGV: సమాజానికి చీడపురుగు లాంటి రాంగోపాల్ వర్మ మీద ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనని కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వర్మ మీద చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసుల మేరకు గుంటూరు సీఐడీ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు.

kolikapudi_srinivasa_rao
kolikapudi_srinivasa_rao
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2024, 5:48 PM IST

Updated : Jan 3, 2024, 10:48 PM IST

Kolikapudi Srinivasa Rao Explanation of Comments on RGV: రాంగోపాల్ వర్మ మీద చేసిన వ్యాఖ్యలకు (Kolikapudi Srinivasa Rao Comments on RGV) సంబంధించి సీఐడీ అడిగిన 30 ప్రశ్నలకు రాతపూర్వక సమాధానం ఇచ్చినట్లు అమరావతి పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మతో ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని, కేవలం ప్రతిపక్ష నేతల్ని కించపరుస్తూ అసత్యాలతో తీసిన సినిమాపై చర్చించే క్రమంలో మాత్రమే అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టం చేశారు. మళ్లీ జనవరి 8 వ తేదీన విచారణకు రావాలని సీఐడీ అధికారులు ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాదులోని ఒక ప్రైవెటు ఛానల్లో రాంగోపాల్ వర్మ మీద కొలికపూడి వ్యాఖ్యలు చేస్తే ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడం ఏంటని న్యాయవాది లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.

ఆర్జీవీ నటుడు మాత్రమే - కథ, స్కీన్ ప్లే, దర్శకత్వం అంతా వైసీపీనే: కొలికపూడి

జగన్ రెడ్డి అవినీతి, అరాచకాన్ని ప్రశ్నించడమే నేరమా: అచ్చెన్న

విలువలు లేని రాంగోపాల్ వర్మ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, లోకేశ్​, పవన్ కల్యాణ్​ తదితరులను కించపరిచేలా చిత్రం తీయడంపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. యువతని సమాజాన్ని నాశనం చేసేలా రాంగోపాల్ వర్మ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు సంబంధించి రాంగోపాల్ వర్మ కేవలం నటుడు మాత్రమేనని, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వైసీపీ ప్రభుత్వమేనని విమర్శించారు.

కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి సీఐడీ అధికారులు - 3న విచారణకు రావాలని నోటీసులు

ఇదీ జరిగింది: ఇటీవల కొలికపూడి శ్రీనివాసరావు ఓ టీవీ ఛానల్‌లో చర్చా కార్యక్రమం నిర్వహించగా అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు కొలికపూడి సమాధానాలు చెప్తూ 'రామ్​గోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తా’ అంటూ ఛాలెంజ్ చేశారు. దీంతో కొలికపూడి వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి. కొలికపూడి వ్యాఖ్యలపై స్పందించిన రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ డీజీపీకి ఫిర్యాదు (Ramgopal Verma Complained to AP DGP) చేశారు. కొలికపూడి వల్ల నాకు ప్రాణ భయం ఉందని వెంటనే వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరో 4 నెలల్లో జగన్​ ఇంటికే - చంద్రబాబుతోనే అమరావతి నిర్మాణం: కొలికపూడి

వెంటనే స్పందించిన ఏపీ సీఐడీ రాంగోపాల్​ వర్మ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్​లోని కొలికపూడి ఇంటికి(AP CID Officials at Kolikapudi Srinivasa Rao House) వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో కొలికపూడి భార్యను ఆఫీసు నుంచి ఇంటికి రావాలని కోరారు. కొలికపూడి ఇంటి వద్ద సీఐడీ అధికారులు ప్రవర్తించిన తీరు తీవ్ర దుమారం రేపింది. ఇంట్లో కొలికపూడి ఆయన సతీమణి ఇందుబాటులో లేకపోవడంతో ఇంట్లో ఉన్న ఆరేళ్ల పాపకు నోటీసులు ఇస్తామనడం చర్చనీయాంశంగా మారింది. ఆ తరువాత సీఐడీ అధికారులు కొలికిపూడి శ్రీనివాసరావు సతీమణి మాధవికి నోటీసులు అందజేసి వచ్చె నెల 3వ తేదీన గుంటూరు సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలంటూ నోటీసులో పేర్కొన్నారు.

Last Updated : Jan 3, 2024, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.