ETV Bharat / state

తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తా: కోడెల శివరాం - 4 నుంచి ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు

నరసరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపించిన నాయకుడు కోడెల అని  తనయుడు కోడెల శివరామ్ అన్నారు. చంద్రబాబు ఆదేశాలే మాకు శిరోధార్యమన్న ఆయన.. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

kodela-sriram-comments
author img

By

Published : Sep 30, 2019, 6:09 PM IST

కోడెల ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం:తనయుడు శివరాం
గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన కోడెల సంస్మరణ సభలో ఆయన కుమారుడు శివరామ్ తన తండ్రి సేవలను గుర్తు చేసుకున్నారు . తమ కుటుంబానికి అండగా ఉంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు అండతో కోడెల శివప్రసాదరావు ఎన్నో మంచి పనులు చేశారన్నారు. నరసరావుపేటను అభివృద్ధి బాటలో తీసుకెళ్లిన నాయకుడు కోడెల అన్నారు. తమ తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడే ఎన్నో దాడులు ఎదుర్కొన్నారన్న శివరామ్... అభివృద్ధి మంత్రంతోనే వాటన్నింటిని తిప్పికొట్టారన్నారు. ఓట్ల కోసం కాకుండా అభివృద్ధే లక్ష్యంగా కోడెల పని చేశారని గుర్తు చేశారు. మాకు పదవులతో పని లేదని..కార్యకర్తలకు అండగా ఉంటే చాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆదేశాలు మాకు శిరోధార్యమన్న ఆయన.. తన తండ్రి ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు.

Intro:AP_cdp_46_30_prapancha_antariksha_varostavaalu__Av_Ap10043
k.veerachari, 9948047582
కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో అక్టోబరు 4 నుంచి 6 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ నారాయణ, వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి తెలిపారు. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 4 నుంచి 10 వరకు నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల్లో భాగంగా రాజంపేట అన్నమాచార్య కళాశాలలో 4వ తేదీ ప్రజల్లో వారోత్సవాల పై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. 5 6 తేదీల్లో అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇప్పటివరకు ప్రయోగించిన రాకెట్ల నమూనాలను ప్రదర్శిస్తారని చెప్పారు. ఇదే సమయంలో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు. రాజంపేట చుట్టుపక్కల ల ప్రాంతంలోని విద్యార్థులతోపాటు ప్రజలు కూడా ఈ వారోత్సవాలకు తరలిరావాలని, ఎన్నో విషయాలను తెలుసుకోవాలని కోరారు.

Body:4 నుంచి ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు

Conclusion:అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.