ETV Bharat / state

గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక ప్రారంభించిన జేసీ దినేష్

గుంటూరులోని స్తంభాల గరువులో ఏర్పాటు చేసిన గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికను జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. విద్యుత్ దహన వాటికలో నిర్వహణ ఖర్చు ఎక్కువ కావటంతోపాటు.. కాలుష్యం కూడా ఉంటుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన విభాగంలో రోజుకు 20 మృతదేహాలు దహనం చేసే వీలుందని జేసీ పేర్కొన్నారు.

గ్యాస్ ఆధారిత స్మశాన వాటికను ప్రారంభించిన జేసీ దినేష్

author img

By

Published : Oct 24, 2020, 3:25 PM IST

Updated : Oct 24, 2020, 10:11 PM IST

గ్యాస్ ఆధారిత స్మశాన వాటికను ప్రారంభించిన జేసీ దినేష్
గ్యాస్ ఆధారిత స్మశాన వాటికను ప్రారంభించిన జేసీ దినేష్

గుంటూరు జిల్లాలో కొవిడ్ మరణాలు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో మృతదేహాల అంత్యక్రియలపై అధికారులు దృష్టి పెట్టారు. నగరంలోని స్తంభాల గరువు శ్మశాన వాటికలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికను జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారభించారు.

అక్కడ నిర్వహణ ఖర్చు ఎక్కువ..
విద్యుత్ దహన వాటికలో నిర్వహణ ఖర్చు ఎక్కువ కావటంతోపాటు.. కాలుష్యం కూడా ఉంటుందన్నారు. అందుకే దాతల సాయంతో గ్యాస్ ఆధారిత దహన వాటికను ఏర్పాటు చేసినట్లు జేసీ వివరించారు. కొత్తగా ఏర్పాటు చేసిన విభాగంలో రోజుకు 20 మృతదేహాలను దహనం చేసే వీలుందన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిమ్నీ వల్ల.. కాలుష్యం వెదజల్లకుండా నివారించవచ్చని పేర్కొన్నారు.

బొంగరాల బీడులోనూ అలాంటిదే..
సుమారు రూ.40 లక్షల వ్యయంతో దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బొంగరాల బీడులోని శ్మశాన వాటికలోనూ ఇలాంటి విభాగం ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. తద్వారా కొవిడ్ మృతులతో పాటు సాధారణ మరణాల వారి అంత్యక్రియలకు ఎలాంటి సమస్య రాదని అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి : లాక్‌డౌన్‌లోనూ కొనసాగిన దురాగతం.. పసితనంలోనే పసుపుతాడు

Last Updated : Oct 24, 2020, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.