గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి నిర్మాణ సంస్థ నుంచి రూ. 1.44 కోట్ల జరిమానాను వసూలు చేసినట్లు తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. జాతీయ రహదారి పక్కనున్న 7.5 ఎకరాల్లో 2016 సంవత్సరంలో ఆ నిర్మాణ సంస్థ భూమార్పిడి చేయకుండానే బహుళ అంతస్తుల భవనం నిర్మించిందన్నారు. ఈ కారణంగా 18న జరిమానా విధించగా, ఆ సంస్థ చలానా రూపంలో ప్రభుత్వానికి చెల్లించినట్లు తహసీల్దారు వివరించారు.
ఇదీ చదవండి: 'సంగం డెయిరీ యాజమాన్య హక్కుల బదలాయింపు కుట్రపూరితం'