గుంటూరు నగరంలో ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచి... వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న పీవీకే నాయుడు మార్కెట్ ను వేలంలో అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జనసేన పార్టీ శ్రేణులు 10 రోజులపాటు నిరసన దీక్షలు చేసి... ఈ మార్కెట్ ను కాపాడాలని డిమాండ్ చేశారు. వేలం జాబితా నుంచి పీవీకే.నాయుడు మార్కెట్ ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటాని స్వాగతిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
ఈ మార్కెట్ పై ఆధారపడే చిరు వ్యాపారులు, కూలీలు, ఇక్కడికి తమ పంటలు తరలించే రైతులకీ జనసేన బాసటగా నిలిచిందన్నారు. గుంటూరు మార్కెట్ విషయంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఎలా నిర్ణయం తీసుకున్నారో ఇతర ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్తులు అమ్మేసి ఆదాయం పెంచామంటే ప్రజలు హర్షించరని పవన్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి