ETV Bharat / state

'మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మృతి దేశానికి తీరని లోటు' - former president pranab mukharjee death

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల జనసేన అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమని పవన్ అన్నారు.

janasena president pawan kalyan condolence to former president pranab mukharjee death
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మృతిపై జనసేనాని పవన్ సంతాపం
author img

By

Published : Aug 31, 2020, 8:06 PM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జీవితం, రాజకీయ ప్రస్థానం.. భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన మృతి పట్ల పవన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. ఆయన మరణం.. దేశానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

janasena president pawan kalyan condolence to former president pranab mukharjee death
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మృతిపై జనసేనాని పవన్ సంతాపం

స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో పుట్టి, రాజకీయాల్లో ప్రవేశించిన ప్రణబ్ ముఖర్జీ... ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా, కేంద్ర మంత్రిగా ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ఎదిగినా తన మూలాలు మరచిపోకుండా, తమ వంశానికి సంబంధించిన సంప్రదాయాలు ఆచరించారని గుర్తు చేశారు. పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలతో ఆయన సేవలను భారతావని సముచితంగా సత్కరించుకుందని తెలిపారు.

ఇదీ చదవండి:

ఆసుపత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్ఛార్జ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.