ETV Bharat / state

'మరో 30 ఏళ్లయినా వెలిగొండ పూర్తవుతుందా..!' 29న ఒంగోలులో జన చైతన్య వేదిక సదస్సు - రాష్ట్ర బడ్జెట్

Veligonda Project : రాష్ట్ర బడ్జెట్​లో నీటి పారుదల ప్రాజెక్టులకు 5శాతం నిధులు కేటాయించగా, వెలిగొండ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు వెచ్చించారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ.3వేల కోట్లు అవసరం కాగా, ఈ లెక్కన మరో 30 ఏళ్లయినా ఎదురు చూడాల్సిందేనా అని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి ప్రశ్నించారు. గతేడాది మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. 2023 సెప్టెంబర్‌లో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళ్తామని ఆయన చెప్పడాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.

జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి

author img

By

Published : Mar 21, 2023, 7:27 PM IST

veligonda project : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై రాష్ట్ర బడ్జెట్లో కేవలం 5% కేటాయించిందని, వెలిగొండ ప్రాజెక్టు కోసం కేవలం 100 కోట్ల రూపాయలు కేటాయించడం అన్యాయమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ రెడ్డి అన్నారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్ర బడ్జెట్లలో 15% నీటిపారుదల ప్రాజెక్టులకు కేటాయించడంతో పాటు అదే మొత్తాన్ని వ్యయం చేశారని గుర్తు చేశారు. ఫలితంగా నీటిపారుదల ప్రాజెక్టులు వేగంగా అమలయ్యాయన్నారు. నేడు అధ్వాన్న స్థితిలో ఉన్నాయని.. 2023 సెప్టెంబర్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. బడ్జెట్ లో 100 కోట్లు మాత్రమే కేటాయించారని దుయ్యబట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. 2005లో ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి హయంలో వేగంగా అభివృద్ధి చేశారని.. గత నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి, పనుల్లో వేగం మందగించిందని తెలిపారు. దీనిపై 24న ఒంగోలు లో సదస్సు నిర్వహించనున్నట్లు వివరించారు.

జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి

కృష్ణా, గోదావరి, పెన్నా నదీ జలాలతో రాష్ట్రం అంతా నీటిని అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలకు నీరందించే ప్రాజెక్టు. దాదాపు 4.7లక్షల ఎకరాలకు నీరందించే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో కేవలం వంద కోట్ల నిధుల విడుదల వెచ్చించింది. ఇప్పటికే 90శాతం పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టుకు.. ఈ లెక్కన ఏటా 100 కోట్లు రూపాయలు ఖర్చు చేసినా ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా 30 సంవత్సరాలు పడుతుంది. 3వేల కోట్ల రూపాయలు కేటాయించి త్వరగా పూర్తి చేసి సాగు, తాగు నీరందించాలి. ఈ మేరకు ఒంగోలులో ఈ నెల 29న నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలి. - వీ.లక్ష్మణరెడ్డి, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు

ప్రాజెక్టు నేపథ్యమిదీ... పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లా సశ్యశ్యామలం అవుతుంది. దీంతో పాటు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కడప జిల్లాలోని బద్వేల్ ప్రాంతాలకు సైతం నీరందించే వీలున్న ఈ ప్రాజెక్టుకు 1996 మార్చి 5న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. అనుమతుల్లో జాప్యం, సాంకేతిక సమస్యల కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా, అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి.. 2004 అక్టోబరులో మళ్లీ అదే గొట్టిపడియ దగ్గర ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రధాన కాల్వల నిర్మాణం పూర్తి కావొచ్చినా నీటిని అడవిని దాటి మైదానానికి తీసుకు రావలసిన సొరంగాల పనులు పెండింగ్ లో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌, కొల్లంవాగు వద్ద నిర్మిస్తున్న హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 2 సొరంగాల ద్వారా దాదాపు 43 టీఎంసీల నీటిని తోడి కరవు ప్రాంతాలకు ఇవ్వాలన్నదే ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ప్రకాశం జిల్లాలో 23 మండలాల పరిధిలో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు, కడప జిల్లాల్లో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది ప్రణాళిక.

ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళ్తామని... 2022 ఆగస్టు 24.. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పనులు ఏడాదిలోగా పూర్తి చేసి 2023 సెప్టెంబర్‌లో జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళ్తామని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ఈ మేరకు ప్రాజెక్టు రెండు టన్నెళ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.