ETV Bharat / state

Jagananna Vidya Kanuka Kits: జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపకుండానే టెండర్లు.. భారీగా ప్రజాధనం వృథా

Jagananna Vidya Kanuka Kits: జగనన్న విద్యాకానుక కిట్లు, ట్యాబ్‌ల కొనుగోలులో అడ్డగోలుతనాన్ని.. ఆడిడ్‌ విభాగం నిగ్గుతేల్చింది. జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపకుండానే ట్యాబ్‌లకు టెండర్లు ఖరారు చేశారని ఆక్షేపించింది. గతేడాదే 3 లక్షల విద్యాకానుక కిట్లు మిగిలినా.. మళ్లీ విద్యార్థుల సంఖ్య పెంచేసి టెండర్లు పిలిచారని పేర్కొంది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయంపై ఆడిట్‌ నిర్వహించిన అధికారులు.. అస్తవ్యస్త నిర్ణయాలతో భారీగా ప్రజాధనం వృథా అయిందని నివేదించారు.

Jagananna Vidya Kanuka Kits
జగనన్న విద్యా కానుక కిట్లు
author img

By

Published : Jun 15, 2023, 8:37 AM IST

Jagananna Vidya Kanuka Kits: జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపకుండానే టెండర్లు.. భారీగా ప్రజాధనం వృథా

Jagananna Vidya Kanuka Kits: "ప్రతి కాంట్రాక్టు టెండర్లకు పోవడం కంటే ముందే.. జ్యుడీషియల్ కమిషన్ దగ్గరకి పంపిస్తాం. జ్యుడీషియల్ కమిషన్ ఏ విధమైన సూచనలు చేసినా పాటిస్తాం". ఈ మాటలు ప్రమాణ స్వీకారం సమయంలో.. ముఖ్యమంత్రి జగన్‌ జపించిన పారదర్శక మంత్రం. కానీ ఆయన చెప్పేదొకటి చేసేదొకటి కదా.

వందకోట్లు దాటే ప్రతీ టెండర్‌ను జ్యూడీషియల్‌ ప్రిప్యూకు పంపిస్తామని ఉత్తర్వులైతే ఇచ్చారుగానీ.. 750 కోట్ల విలువైన.. ట్యాబ్‌ల పంపిణీ టెండర్‌ను మాత్రం జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపలేదు. దీనివెనకున్న మర్మమేంటనేది రాష్ట్ర ఆడిటింగ్‌ విభాగం ప్రశ్నిస్తోంది. 2018 జులై నుంచి.. 2022 డిసెంబరు మధ్య కాలానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయ ఖాతాలు, లావాదేవీలను.. పరిశీలించిన రాష్ట్ర అడిట్‌ విభాగం.. అస్తవ్యస్త నిర్ణయాలను తూర్పారబట్టింది.

Childrens Protest For School: 'మాకు పాఠశాల కావాలి జగన్ మావయ్య..' ప్లకార్డులతో చిన్నారుల నిరసన

2022-23 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి విద్యార్థులు, టీచర్లకు 750 కోట్ల రూపాయలతో 5 లక్షలకు పైగా ట్యాబ్‌లు కొనుగోలు చేశారని, ఆ టెండర్లును.. జ్యుడిషియల్‌ ప్రివ్యూకు ఎందుకు పంపలేదని అడిగితే పాఠశాల విద్యాశాఖ సమాధానం ఇవ్వలేదని ఆడిట్‌ విభాగం ఆక్షేపించింది.‘‘ప్రాథమిక, సెకండరీ స్థాయి విద్యార్థులకు.. ప్రభుత్వం అందజేసే సేవలకు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ శాఖ.. జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చింది. కానీ.. అన్‌బాక్స్‌ గాడ్జెట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు.. ఒక్కో ట్యాబ్‌కి అసలు ధర 10 వేల 883 రూపాయలు కాగా దానికి జీఎస్టీ 1,959 రూపాయలు కలిపి 12 వేల 843 చొప్పున చెల్లించిందని పేర్కొంది.

మొత్తం 5 లక్షల 18 వేల 740 ట్యాబ్‌లకు.. సుమారు 101 కోట్ల 62 లక్షల జీఎస్టీని చెల్లించారని.. కేంద్రం ఇచ్చిన జీఎస్టీ మినహాయింపును ఎందుకు ఉపయోగించుకోలేదో చెప్పాలని కోరినా.. పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఇంత వరకు స్పందించలేదని పేర్కొంది. ట్యాబ్‌లు కొనుగోలు చేసినందుకు ఏపీటీఎస్‌కు 2.5% చొప్పున 16.65 కోట్ల రూపాయలను సర్వీసు ఛార్జీగా పాఠశాల విద్యాశాఖ చెల్లించిందని, దానిపై 2.99 కోట్ల రూపాయలను జీఎస్టీగా చెల్లించిందని. ఆక్షేపించింది. పాఠశాల విద్యాశాఖే.. నేరుగా ట్యాబ్‌లను కొనుగోలు చేస్తే ఈ ఖర్చు తగ్గేదని చెప్పింది.

'సాయం చేయండి'.. కొడుకు వైద్యం కోసం సీఎం కాన్వాయ్ వెంట తల్లి పరుగులు

ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్లు సపోర్ట్‌ చేసే హార్డ్‌వేర్‌ ఉన్న.. ట్యాబ్‌లనే కొనాలని ప్రభుత్వం ముందే నిర్దేశించినా.. దాన్ని అనుసరించడంలో పాఠశాల విద్యాశాఖ విఫలమైందని.. ఆడిట్‌ విభాగం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో, మెజారిటీ విద్యార్థుల ఇళ్లలోనూ.. ఇంటర్నెట్‌ సదుపాయం ఉండదన్న కనీస పరిజ్ఞానం లేకుండా.. ఆన్‌లైన్‌లో కంటెంట్‌ అందుబాటు ఉంచే.. ఉద్దేశంతో ట్యాబ్‌లు కొనడాన్ని తప్పుబట్టింది.

తీరా ట్యాబ్‌లు జిల్లాలకు పంపేశాక.. అప్పుడు నాలుక కరచుకుని, మెమొరీ కార్డుల్లోకి కంటెంట్‌ ఎక్కించి.. ట్యాబ్‌లలో అమర్చేందుకు 22.04 కోట్ల రూపాయలను అదనంగా.. అన్‌బాక్స్‌ గాడ్జెట్స్‌ సంస్థకు చెల్లించారని తెలిపింది. బైజూస్‌ కంటెంట్‌ని.. మెమొరీ కార్డుల ద్వారా ట్యాబ్‌లలో వేశారని, ట్యాబ్‌లు కొనడానికి ముందే.. ఎలాంటి హార్డ్‌వేర్‌ కావాలో ఎందుకు గుర్తించలేకపోయారనే ప్రశ్నకు పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేకపోయిందని ఆడిటింగ్‌ విభాగం పేర్కొంది.

ఇక విద్యాకానుక కిట్ల వృథానూ.. ఆడిటింగ్‌ విభాగం తూర్పారబట్టింది. 2022-23 విద్యా సంవత్సరానికి 1,565 రూపాయల చొప్పున.. 45 లక్షల 14వేల 687 విద్యాకానుక కిట్లు కొన్నారని వివరించింది. ‘‘2021 అక్టోబరులో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థుల సంఖ్య 45.60 లక్షలుగా పేర్కొన్న పాఠశాల విద్యాశాఖ.. విద్యార్థుల సంఖ్య 5% పెరుగుతుందనే భావనతో 2022-23లో 45.14 లక్షల కిట్లు కొనేందుకు టెండర్లు పిలిచినట్లు తెలిపింది. కానీ విద్యార్థుల సంఖ్య 2022 సెప్టెంబరుకు 40.66 లక్షలకి పడిపోవడంతో.. 2022-23 విద్యా సంవత్సరానికి కొన్న కిట్లలోనే.. 3 లక్షలకు పైగా మిగిలిపోయినట్లు గుర్తించింది.

Housing scheme in ap పల్లె పేదలకు జగన్‌ సర్కారు సొంతంగా ఒక్క ఇల్లూ కట్టలేదు.. స్థలాలు ఇచ్చి సరిపెట్టేశారు

2023-24 విద్యా సంవత్సరానికి మళ్లీ టెండర్లు పిలిచేటప్పుడు.. క్రితం ఏడాది మిగిలిన 3 లక్షల కిట్లు గురించి ఆలోచన చేయకపోవడం వల్ల.. 46 కోట్లు 95 లక్షల ప్రజాధనం వృథా అయిందని ఆడిటింగ్‌ విభాగం స్పష్టం చేసింది. విద్యార్థుల వాస్తవ సంఖ్యను ఎందుకు పరిగణలోకి తీసుకున్నారనే.. ప్రశ్నకు పాఠశాల విద్యాశాఖ నుంచి సమాధానం లేదని ఆడిటింగ్‌ విభాగం ఆక్షేపించింది. పాఠశాల విద్యాశాఖ 2018-2023 ఆర్థిక సంవత్సరాల మధ్య.. 18 బిల్లుల ద్వారా చేసిన 27 కోట్ల 93 లక్షల చెల్లింపులకు ఎలాంటి వివరాలు లేవని.. ఆడిట్‌ విభాగం గుర్తించింది.

ప్రభుత్వం మనబడి నాడు-నేడు మొదటిదశలో భాగంగా 3వేల317 స్కూళ్లకు 15 వేల 685 గ్రీన్‌ చాక్‌బోర్డులు కొనుగోలు చేసిందని.. ఒక్కో చాక్‌బోర్డుకు 10వేల 488 చొప్పున 16 కోట్ల 45 లక్షలు ఖర్చుపెట్టిందని.. ఆడిటింగ్‌ విభాగం తెలిపింది. రాష్ట్రంలో గతంలోనే 3వేల 941 వర్చువల్‌ క్లాస్‌రూమ్‌లు.. 13 జిల్లా స్టూడియోలు.. 4,786 డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు ఉన్నాయి. 10,985 స్మార్ట్‌టీవీలు, 779 అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ క్లాస్‌రూంలూ ఉన్నాయి.

వీటన్నింటినీ.. ఏం చేయాలనే స్పష్టత లేకుండా కొత్తగా ఇంటరాక్టివ్‌ ప్యానల్స్‌ కొనడం వల్ల.. 16.45 కోట్ల రూపాయలు వృథా కాదా అనే ప్రశ్నలకు పాఠశాల విద్యాశాఖ నుంచి.. ఎలాంటి సమాధానం లేదని ఆక్షేపించింది. ఆడిట్‌ విభాగం ప్రశ్నల్లో.. ఒక్కదానికీ సమాధానం చెప్పకపోవడం విద్యాశాఖ లెక్కలేనితనానికి అద్ధంపడుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.