గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానానికి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (HYM) ఐఎస్‌వో గుర్తింపునిచ్చింది. ఈ మేరకు గుర్తింపు ధ్రువపత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో దేవస్థానం కమిటీ ఛైర్మన్ మాలరాజు వెంకట రామకృష్ణ, ఆలయ ఈవో రామకోటిరెడ్డి, వేదపండితులకు సంస్థ ప్రతినిధులు అందజేశారు.
కోటప్పకొండ దేవాలయానికి ఐఎస్‌వో గుర్తింపు రావటం పట్ల ఎమ్మెల్యే గోపిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. దేవస్థానంలో నాణ్యమైన సేవలందించేందుకు సహకరిస్తున్న కార్యనిర్వాహకులకు, పాలకమండలి, వేదపండితులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కోటప్పకొండ మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. 2022లో కోటప్పకొండలో భక్తులకు అందిస్తున్న లడ్డూ, అరిసె ప్రసాదాలకు కూడా అంతర్జాతీయ గుర్తింపు ఇస్తామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించినట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
E-Cars: ఇకపై విద్యుత్ కార్లను వినియోగించనున్న తితిదే అధికారులు