గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో మూడో దశ ఎన్నికలు 8 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. మాడుగులలో బ్యాలెట్ పత్రాల్లో తప్పులు రావడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఇద్దరు అభ్యర్థులకు అధికారులు ఒకే గుర్తు ముద్రించారు. దీంతో 12, 13 వార్డుల్లో పోలింగ్ నిలిచిపోయింది. తిరిగి ఈనెల 21న మాడుగులలో పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: