గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఓ ఇంటిపై విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 89 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు.
సాతులూరులో వాలంటీర్ తక్కెళ్ళపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో రేషన్ బియ్యం మాఫియా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేశారు. వాలంటీర్లు కూడా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారంలో ఉండటం తెలిసి అధికారులు ఆశ్చర్యపోయారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు.
ఇదీ చదవండి: