గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కమ్మవారి పాలెంలో ఓ రైతు పశువుల పాకలో 35 బస్తాల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. స్థానిక వైకాపా నాయకులు శ్రీనివాసరావు, కిలారు రవీంద్రకు చెందిన పశువుల షెడ్డుగా అధికారులు గుర్తించారు. అది కూడా.. వ్యవసాయ శాఖ అనుమతి లేని పేర్లతో 3 వేల 450 నకిలి విత్తనాల ప్యాకెట్లు నిల్వ ఉంచినట్టు తేల్చారు. రాబోయే సీజన్లో సాటి రైతులకు వాటిని విక్రయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని తెలిపారు.
విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా... వ్యవసాయ శాఖ అధికారులు దాడులు చేశారు. 25.18 లక్షల విలువచేసే పత్తి నకిలీ విత్తనాలు గుర్తించారు. విత్తన చట్టప్రకారం వాటిని ప్రయోగశాలకు పంపి.. ఫలితాల అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. గ్రామాల్లో రైతులు అనుమతులు లేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు సంబంధించి ఎలాంటి గోదాములు, భవనాలు అద్దెకు ఇవ్వవద్దని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: