గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా వద్ద ట్యాంకర్ నుంచి హైడ్రోక్లోరిక్ ఆమ్లం లీకైంది. నరసరావుపేట నుంచి విశాఖ జిల్లాలోని హెటిరో ల్యాబ్‌కు గ్యాస్ తరలిస్తుండగా...లీకైనట్లు గుర్తించారు. వెంటనే ట్యాంకర్‌ను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రాంతానికి తరలించారు. ఘటనాస్థలానిక చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది లీకేజ్ అదుపులోకి తీసుకువచ్చారు. ట్యాంకర్లో 27టన్నుల హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉందని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు.
ఇదీచదవండి