రాజధాని రైతులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని హోం మంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని తరలిస్తున్నట్లు తాము ఎక్కడా చెప్పలేదని గుంటూరు జిల్లా పెదనందిపాడులో చెప్పారు. రూ. 5.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆమె ఈటీవీ భారత్తో మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయడమే తమ లక్ష్యమన్న ఆమె.. రాజధాని తరలింపునకు, అభివృద్ధి వికేంద్రీకరణకు చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. అమరావతి శాసనసభ రాజధానిగా కొనసాగుతుందని... వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. అమరావతిలో శాసన సభ, హై కోర్టు బెంచ్, రాజ్ భవన్ కార్యాలయాలు ఉంటాయన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: