కనుమ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో.. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న కామధేను పూజా కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. నరసరావుపేటలో ఈ కార్యక్రమ ఏర్పాట్లను హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పరిశీలించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రైతుతో పాటు వారికి సంభందించిన గోవులను కూడా పూజించుకోవాలని వారు చెప్పారు.
అలాంటి గోపూజ కార్యక్రమానికి ప్రాముఖ్యతనిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని ఆలయాలకు గోవులను సమర్పించే కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుందని రాష్ట్ర హోంమంత్రి మేకతోట సుచరిత వివరించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: