ETV Bharat / state

HOME MINISTER: 'అన్ని నియోజకవర్గాల్లో వ్యవసాయ పరీక్షా కేంద్రాలు' - ప్రత్తిపాడులో వ్యవసాయ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన హోంమంత్రి

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వ్యవసాయ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ మేరకు ప్రత్తిపాడులో రూ.62 లక్షలతో నిర్మించిన అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్​ను ప్రారంభించారు.

మాట్లాడుతున్న హోంమంత్రి సుచరిత
మాట్లాడుతున్న హోంమంత్రి సుచరిత
author img

By

Published : Jul 8, 2021, 4:01 PM IST

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేసేందుకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ కేంద్రంలో వ్యవసాయ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని 73 కిలోల కేక్ కట్ చేశారు. అనంతరం రూ. 62 లక్షలతో నిర్మించిన అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్ భవనాన్ని కలెక్టర్ వివేక్ యాదవ్​తో కలసి ఆమె ప్రారంభించారు.

అనంతరం సభలో హోంమంత్రి ప్రసంగించారు. రైతులకు ఇచ్చే ప్రతి విత్తనాన్ని, ఎరువులు పరీక్ష కేంద్రాలలో పరిశీలిస్తారని చెప్పారు. రెండేళ్లలో రైతుల సంక్షేమానికి రూ. 83 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసినట్లు చెప్పారు. పాత సంప్రదాయం పద్దతుల్లో పంటలు సాగు చేయాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని చెప్పారు.

ఇదీ చదవండి:

JAGAN CBI CASE: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.