నేటి నుంచి ఐదు రోజుల పాటు గుంటూరు మిర్చియార్డుకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఈనెల 21న శ్రీరామనవమి, 22, 23 తేదీల్లో యార్డులో కార్యకలాపాలు నిలిపివేత, 24, 25 తేదీలు శని, ఆదివారాలు సాధారణ సెలవు దినాలుగా అధికారులు వెల్లడించారు. ఫలితంగా రైతులు మార్కెట్కు సరకును తీసుకురావద్దని మార్కెట్ యార్డు కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి సూచించారు.
వారం రోజులుగా వచ్చిన సరకుతో యార్డు పూర్తిగా నిండిపోవడంతో... నిల్వలో ఉన్న సరకును విక్రయించేంత వరకూ కొత్త సరకు తీసుకురావద్దని రైతులకు తెలిపారు. ఈనెల 26వ తేదీ నుంచి మార్కెట్ కార్యకలాపాలు యథావిధిగా ఉంటాయని వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
ఇదీచదవండి.