గుంటూరు జిల్లా మంగళగిరిలో రాజకీయ ఫ్యాక్షన్ పాలన నడుస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో పేదల ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కావాలనే ఇళ్లు కూల్చారని తెదేపా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. ఆత్మకూరులో ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు 3 వారాలపాటు స్టే విధించినట్లు తెలిపారు. బాధితులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారన్నారు. గత ఎన్నికల్లో తాము వైకాపాకు ఓట్లు వేయనందుకే ఇళ్లు కూల్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: పోలీసుల పహారాలో ఇళ్ల కూల్చివేత.. ఆందోళనలో స్థానికులు