ETV Bharat / state

ప్రైవేటు పాఠశాలల్లో 25% కోటాపై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా.. - కోర్టు వార్తల వివరాలు

ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా 25% కోటా కింద సీట్లు పొందే అంశంపై  ప్రభుత్వం జారిచేసిన జీవోపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. విద్యార్థుల తల్లుల ద్వారా కాకుండా ఫీజ్​ రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును నేరుగా పాఠశాలల యాజమాన్యాలకే చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

highcourt
highcourt
author img

By

Published : Apr 3, 2023, 10:46 PM IST

free 25% quota seats in private schools: విద్యాహక్కు చట్టం నిబంధనల మేరకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా 25% కోటా కింద సీట్లు పొందే అంశంపై నేడు హైకోర్టులో వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అమ్మఒడి పథకం సాయం నుంచే విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ వేసిన పిటిషన్లపై న్యాయమూర్తి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిద వేశారు.

తీర్పును వాయిదా వేసిన న్యాయ మూర్తి: ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా 25% కోటా కింద సీట్లు పొందే అంశంపై ప్రభుత్వం జారిచేసిన జీవోపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలల్లో 25% కోటా కింద సీట్లు పొందిన పిల్లల తల్లిదండ్రులు అమ్మఒడి పథకం సాయం నుంచే ఫీజులు చెల్లించుకోవాలంటూ.. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ప్రభుత్వం జారీచేసిన జీవో 24ను సవాలు ఇండిపెండెంట్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోగంటి శ్రీకాంత్, యునైటెడ్‌ ప్రైవేట్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ గొల్లపూడి మోహన్‌రావు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ప్రభుత్వం ఫీజులను సక్రమంగా నిర్ణయించలేదు: విద్యార్థుల తల్లుల ద్వారా కాకుండా ఫీ రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును నేరుగా పాఠశాలల యాజమాన్యాలకే చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. 25% కోటా సీట్లకు ప్రభుత్వం ఫీజులను సక్రమంగా నిర్ణయించలేదన్నారు. ఫీజు నిర్ణయం విషయంలో ఎన్జీవోలు, పాఠశాల యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయలేదన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం సెప్టెంబర్, జనవరిలో ఫీ రీయింబర్స్‌మెంట్‌ చేయాల్సి ఉంటుందన్ని న్యాయవాది కోర్టులో వెల్లడించారు. అందుకు భిన్నంగా ప్రభుత్వం అమ్మఒడి సొమ్మును ఏప్రిల్లో చెల్లిస్తామంటోందన్నారు.

ఏజీ శ్రీరామ్: ఆర్టీఈ చట్టాన్ని అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో ప్రతి విద్యార్థికి సగటున రూ.14 వేల నుంచి 17వేల వరకు ఫీజులు చెల్లిస్తున్నారని తెలిపారు. 25శాతం సీట్లు కేటాయింపు అధికారం ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లన్ని నిండాకే ప్రైవేటు పాఠశాలల్లో భర్తీ చేయాలన్న పిటిషనర్ల వాదన సరికాదని ఏజీ శ్రీరామ్ పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి సగటున ఏడాదికి రూ.7వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. తల్లులు చెల్లించడంలో విఫలమైతే మరుసటి విద్యా సంవత్సరం నేరుగా పాఠశాల యాజమాన్యాల ఖాతాలో ఫీజు జమ చేస్తామని కోర్టులో వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.