ETV Bharat / state

ఏబీ వెంకటేశ్వరరావు అరెస్టుపై స్టే పొడిగింపు - ips ab venkateswararao

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అరెస్టుపై స్టేను హైకోర్టు పొడిగించింది. ఏబీ వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్​పై.. కౌంటర్ దాఖలు చేసేందుకు ఏసీబీకి ధర్మాసనం మరింత సమయం ఇచ్చింది.

high court
ఏబీ వెంకటేశ్వరరావు అరెస్టు స్టే పొడిగింపు
author img

By

Published : Aug 19, 2020, 6:21 AM IST

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును అరెస్ట్‌ చేయవద్దంటూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సోమవారం వరకు పొడిగిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. రక్షణ పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో తనను అక్రమంగా కేసులో ఇరికించే ఆవకాశం ఉందని ఈ విషయంలో అరెస్ట్‌ చేయకుండా పోలీసులను నిలువరించాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు.. అరెస్ట్‌పై స్టే ఇచ్చింది. మంగళవారం జరిగిన విచారణలో ఈ వ్యాజ్యంలో కౌంటర్‌ వేయడానికి ఏసీబీకి మరికొంత సమయం ఇచ్చిన న్యాయమూర్తి.. అరెస్ట్‌పై ఉన్న స్టేను పొడిగించారు.

ఇదీ చదవండి: 'విద్యా సంస్థల భూములను.. ఇళ్ల పట్టాలకు వాడొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.