HC FIRES ON BAR ASSOCIATION : ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికను ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రస్తుత కార్యవర్గాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ముందు ఉంచిన మెమోను పరిశీలిస్తే ఎన్నికలు నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు లేదని వ్యాఖ్యానించింది. ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. ఇదే తీరు కొనసాగితే గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించాలని ‘తాత్కాలిక కమిటీని ఆదేశిస్తామని హెచ్చరించింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా న్యాయవాదులను రెండుగా విభజిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎన్నికల నిర్వహణలో సవరించిన మెమో దాఖలు చేస్తామని APHCAA తరఫు న్యాయవాది హై కోర్టుకు తెలిపారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: