Issue Of Gunture ZP chairperson Christina Cast Validation: గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ క్రిస్టీనా, ఆమె భర్త కత్తెర సురేశ్‌కుమార్‌ల కులాన్ని తేల్చాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్న హైకోర్టు.. పిటిషనర్ సమర్పించే వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్‌కు స్పష్టం చేసింది. క్రిస్టీనా, ఆమె భర్త ఎస్సీ కులానికి చెందిన వారంటూ ధ్రువీకరిస్తూ కలెక్టర్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.
హెని క్రిస్టీనా, ఆమె భర్త ఎస్సీ కుల ధ్రువీకరణపత్రం రద్దు చేయాలంటూ చేసిన ఫిర్యాదులను కలెక్టర్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ కొల్లిపర గ్రామానికి చెందిన సరళకుమారి 2021లో హైకోర్టును ఆశ్రయించారు. క్రిస్టీనా, అమె భర్త ఎస్సీలు కాదని.. వారు మతం మారినందున ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని పిటిషన్ తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాధించారు. రెవెన్యూ అధికారులు విచారణ సరిగా చేయకుండా కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఆధారాలను పరిగణనలోకి తీసుకొని ఎస్సీ ధ్రువపత్రం రద్దు చేసేలా కలెక్టర్‌ను ఆదేశించాలని పిటిషనర్ కోరారు.