గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. అధికారికంగా కాని అనధికారికంగా కానీ పట్టణంలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇదీ గమనించిన వార్డు వాలంటిర్లు, ఏఎన్ఎంలు పాజిటివ్ నిర్ధారణ అయిన వారి ప్రైమరీ కాంట్రాక్ట్స లిస్ట్ తీసుకుని పిడుగురాళ్ల పట్టణంలోని మార్కెట్ యార్డులో పర్యటించారు. బుధవారం సుమారు 210 మందికి కరోనా టెస్టులు చేపట్టగా, వారిలో 57 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. మరో రెండు మూడు రోజుల్లో కూడా ఇటువంటి క్యాంపులు నిర్వహిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని వాలంటీర్లు, ఏఎన్ఎంలు తెలుపుతున్నారు.
పిడుగురాళ్లలో కరోనా విలయతాండవం - corona cases in peduguralla
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కరోనా మహమ్మరి విలయతాండవం చేస్తుంది. మార్కెట్ యార్డులో బుధవారం 210 మందికి కొవిడ్ టెస్టులు చేయగా 57 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
![పిడుగురాళ్లలో కరోనా విలయతాండవం heavy corona cases in peduguralla guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8140301-892-8140301-1595500159163.jpg?imwidth=3840)
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. అధికారికంగా కాని అనధికారికంగా కానీ పట్టణంలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇదీ గమనించిన వార్డు వాలంటిర్లు, ఏఎన్ఎంలు పాజిటివ్ నిర్ధారణ అయిన వారి ప్రైమరీ కాంట్రాక్ట్స లిస్ట్ తీసుకుని పిడుగురాళ్ల పట్టణంలోని మార్కెట్ యార్డులో పర్యటించారు. బుధవారం సుమారు 210 మందికి కరోనా టెస్టులు చేపట్టగా, వారిలో 57 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. మరో రెండు మూడు రోజుల్లో కూడా ఇటువంటి క్యాంపులు నిర్వహిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని వాలంటీర్లు, ఏఎన్ఎంలు తెలుపుతున్నారు.
ఇదీ చదవండి: రాజధాని బిల్లుల వ్యవహారంపై వివరాలు కోరిన పీఎంఓ