రాష్ట్రంలో మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ భూముల అమ్మకాలకు సంబంధించి గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. విశాఖ, గుంటూరులోని ప్రభుత్వ స్థలాలు, భూముల అమ్మకాలను ఆపాలని గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు హైకోర్టుని ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. మిషన్ బిల్డ్ ఏపీ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రభుత్వ భూముల వేలం వేయరాదని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. మళ్లీ తాము చెప్పే వరకూ మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని చెప్పింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసినట్లు హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాస్ చెప్పారు.
ఇదీ చదవండి : CM Jagan: మద్యం అక్రమ తయారీ, రవాణాపై ఉక్కుపాదం మోపాలి: సీఎం