కవి గుఱ్ఖం జాషువా 125వ జయంతిని గుంటూరు జిల్లా మాచర్లలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మాచర్ల లోని జాషువా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
తన కలం ద్వారా సమాజంలో అసమానతలు ప్రశ్నించిన జాషువా భావజాలాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జాషువా పద్యాలను చదివి వినిపించారు. దళిత బహుజన ఫ్రంట్, పల్నాడు జిల్లా సాధన సమితి, బీసీ సంక్షేమ సంఘం, రజక వృత్తిదారుల సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: