ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఎంపీ రఘురామ ప్రయత్నించారని గుంటూరు మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం అనవసరంగా ఎంపీ రఘురామ కృష్ణరాజుపై కేసులు పెడుతుందని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. రాజకీయంగా ఉనికిని చాటుకోవడానికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేస్తున్నారని మనోహర్ నాయుడు ఆరోపించారు.
ఇదీ చదవండి: షూ లేకుండా బైక్ నడిపితే ఫైన్- మీకు తెలుసా?