గుంటూరు కొత్త పేట పోలీసుస్టేషన్ పరిధిలోని కుసుమ హరనాథ గుడిలోని విగ్రహాల అపహరణ కేసును చేధించడంలో.. ఆలయ పూజారి దంపతులు కీలకపాత్ర పోషించారని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. అందుకుగానూ.. ఆలయ పూజారి విజయకుమార్, అతని భార్య హైమావతిలను పోలీసులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. గుడిలో దొంగతనం జరిగిన విషయాన్ని సకాలంలో సమాచారమిచ్చి పోలీసులను అప్రమత్తం చేశారని ఎస్పీ చెప్పారు. దర్యాప్తు సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి.. విగ్రహాలను రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.
ఆలయ పూజారి దంపతులను సత్కరించిన పోలీసులు - గుంటూరు న్యూస్
గుడిలో విగ్రహాలను అపహరించిన కేసులో దర్యాప్తు, రికవరీకి సహకరించిన ఆలయపూజారి దంపతులను గుంటూరు జిల్లా పోలీసులు సత్కరించారు.
గుంటూరు కొత్త పేట పోలీసుస్టేషన్ పరిధిలోని కుసుమ హరనాథ గుడిలోని విగ్రహాల అపహరణ కేసును చేధించడంలో.. ఆలయ పూజారి దంపతులు కీలకపాత్ర పోషించారని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. అందుకుగానూ.. ఆలయ పూజారి విజయకుమార్, అతని భార్య హైమావతిలను పోలీసులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. గుడిలో దొంగతనం జరిగిన విషయాన్ని సకాలంలో సమాచారమిచ్చి పోలీసులను అప్రమత్తం చేశారని ఎస్పీ చెప్పారు. దర్యాప్తు సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి.. విగ్రహాలను రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.
ఇదీ చదవండి:
మహిళపై రాళ్ల దాడి కేసులో మరో 11 మంది అరెస్ట్