గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ.. గత నెల 23న మంగళగిరి పోలీసులు.. ఎన్ఆర్ఐ ఉద్యోగులు ఉప్పలపు శ్రీనివాసరావు, వల్లూరిపల్లి నళినిమోహన్ని అరెస్టు చేశారు. కోర్టు గురువారం వారికి బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్పై వచ్చిన వారిని తెదేపా నేతలు అలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్, చిట్టిబాబు జిల్లా జైల్ వద్దుకు వెళ్లి పరామర్శించారు. ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తరుపున వైద్యకళాశాల, బోధనాసుపత్రి నిర్వహిస్తున్నారు. అందులో నిధులను మళ్లించారంటూ సంస్థలో సభ్యునిగా ఉన్న డాక్టర్ కోండ్రగుంట బుచ్చయ్య అనే వ్యక్తి మార్చి 3వ తేదిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: రైతులను అరెస్టు చేసిన పోలీసులు.. కారణమేంటంటే..?