గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి తమ ఓటుహక్కును వినియోగించునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పట్టణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను.. జిల్లా సంయుక్త పాలనాధికారి దినేష్ కుమార్ పరిశీలించారు. 7, 8, 21 వార్డులను పరిశీలించి.. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: 'ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం.. స్వేచ్ఛగా ఓటేయండి'